Title: "Unleashing India's Cricket Triumph: A Fan's Blueprint for Glory"

 ICC T-20, ODI , Test టీమ్ ఆఫ్ ది ఇయర్ లో భారత క్రీడాకారులు అత్యధికం గా 12 మంది స్థానాలు దక్కించుకున్నారు. 


ఈ వార్త నిజమైన ఇండియా క్రికెట్ క్రీడాభిమాని గా ఏ మాత్రం ఆనందం కలిగించలేదు. 


ఎందుకంటే ఇవి కారణాలు ! 

ఒక్కసారి నిజాయితి గా పరిశీలించండి!!!



రెండు, మూడు, నాలుగు స్థానాలలో ఉన్న టీం లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ లు 

ప్రపంచకప్పులు గెలుచుకొన్నాయి. ఆ దేశాలకు క్రీడాకారులు గర్వ కారణం అయ్యారు. 


ప్రపంచం లో మేటి ఆటగాళ్ళ గౌరవం విజయాలతో వస్తుంది. 

కేవలం రికార్డులు తో ఏమి రాదు. 

సముద్రమంతా నీరు ఉన్ననూ, అది తాగడానికి పనికిరాదు 


అలాగే మనం క్రీడాకారుల వ్యక్తిగత రికార్డులకు దేశానికి ఉపయోగ పడనంతవరకూ, విలువ లేదు ! 


వారంతా జట్టుగా విజయాలతో దేశప్రతిష్ట ను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినప్పుడు దేశం గర్విస్తుంది, విలువనిస్తుంది .


గత పదేళ్ల గా మనకు అడపదడపా విజయాలు తప్ప, ప్రపంచస్థాయి విజయాలు లేవు. 


లోపం మనలోనే ఉంది. మనం ఇలా క్రీడాకారుల వ్యక్తిగత విజయాలను, మన విజయాలగా మురిసిపోతున్నాం. అది అబద్దం.

ఈ విచిత్ర వైఖరిని మీడియా గమనించి వాటినే ప్రపంచవిజయాలగా మరింతగా..ప్రాచుర్యం కల్పించి, అసలైన కారణాలను విశ్లేషించడం మానేసింది. ఇందులో వారి వారి వ్యాపార ప్రయోజనాలు దాగున్నాయనేది బహిరంగ రహస్యమే!!!


కాని నిజం దాచేస్తే దాగదు. 


బావి లో కప్పల వలే మన ప్రపంచం లో మనం బ్రతికేస్తే సరిపోదు. మిగతా ప్రపంచం మనల్ని, మన ఆటను, ఏ మేరకు గౌరవిస్తుంది , గుర్తిస్తుందనేది , మన నిజమైన , ప్రపంచ స్థాయి విజయాలతో వస్తుంది. 


మనం కొంతమంది ఆటగాళ్ళను..వారి వ్యక్తిగత విజయాలతో స్టార్ల గా వెర్రి వ్యామోహం పెంచుకోవడం వలన ..వారు తమ వ్యక్తిగత విజయాలను, మరియూ ఈ వ్యామోహం ని వాడుకొని, వ్యాపార ప్రకటనలతో తమ జేబులు నింపుకొంటున్నారు. 


కాని మన కప్ బోర్డ్ లు ప్రపంచకప్పు లు లేక వెల వెల పోతున్నాయి. 


అంతేకాదు, ఈ రోజున సరైన సమయం లో రిటైర్ అవ్వక..క్రొత్త ఆటగాళ్ళకు సరైన అవకాశాల రాక, మనం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ నే ఉంది

ఈ మాదిరి...పరిస్థితులో ఏ మాత్రం మార్పు రాక నిజమైన క్రీడాభిమానులు కు ప్రతి ప్రపంచకప్ లోనా, గత పదేళ్ల గా నిరాశ, నిస్పృహలే మిగిలి పోతుంది. 


ఇది ఇలాగే కొనసాగితే ఈ క్రికెట్ ఈ దేశం లో ప్రాచుర్యం కోల్పోయే రోజు ఎంతో దూరం లో లేదు ! 


సెలక్టర్లు, పొలసీ మేకర్లు, క్రికెట్ క్రీడాఅభిమానులు, ఈ దిశ గా ఆలోచన చెయ్యాలి. సరైన ఆటగాళ్ళను..ఎంకెరేజ్ చెయ్యాలి! స్టార్ల కోసం వెంపర్లాడక, జట్టు సమతూకం పాటించాలి. నాణ్యమైన ఆల్రౌండర్లు, కనీసం బాటింగ్ చేసే బౌలర్లను, ఎంపిక చెయ్యాలి. జట్టులో జవాబుదారితనం పెంచాలి. 


ప్రతి అపజయం నిజాయతి గా విశ్లేషణ చేసి, లోపాలను సరిదిద్దాలి. క్రీడాకారుల వ్యాపార ఎండర్స్మెంట్స్ మీద కూడా ఒక కన్ను వేయాలి. అవి జట్టు ప్రయోజనాలకు అడ్డంగా తయారవ్వకూడదు. ఎంత పెద్ద స్టార్ ప్లేయర్ అయినా, పెర్ఫార్మెన్స్ మాత్రమే కొలమానం కావాలి. లేకుంటే ఏ మాత్రం మొహమాటం లేకుండా జట్టు ప్రయోజనాలకై చర్యలు తీసుకోవాలి. 


ఇలాంటి కఠిన వైఖరి అవలింబించే సెలక్టర్లు, కోచ్లు, కెప్టెన్లు ను మాత్రమే జట్టు యాజమాన్యం ఎంచుకోవాలి. 


అటువంటి జట్టుయాజమాన్నాన్ని..నిజమైన వాటాదారులమైన మనం అంటే క్రికెట్ క్రీడాభిమానుల గుర్తించి గౌరవించాలి.

 అభిమానించాలి.


 మనం నిజమైన వాటాదారులమని ఎందుకు చెబుతున్నానంటే, మనం ఈ క్రీడ ను ఆదరించి, టికెట్ కొనుక్కొని, టీవి, మొబైలలో వీక్షించడం వలనే జట్టు యాజమాన్యం ఆర్ధికం గా పరిపుష్ఠిత సంపాదించుకొంది. క్రీడాకారులక జీతాలు, సౌకర్యాలు ఇవ్వగలుగుతుంది 

కనుక మనం ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలకు జవాబు ఖచ్చితం గా అడిగే హక్కు, అధికారం నిజమైన వాటదారుడుగా ఉంది!!!


మనకు హక్కు ఉన్ననూ, మనం ఏం చేయగలం?? మనం మన అభిప్రాయాలను, సోషల్ మీడియాలోనూ, లేదా బ్లాగ్ లలోనూ ఒకరికి ఒకరూ పంచుకోవడం ద్వారా ఒక పీక్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. దాని వలన మరింత మందికి అవగాహన కలుగుతుంది. దీంతో, కొంత మంది కాన్స్యయస్నెస్ కలిగిన స్పోర్ట్స్ జర్నలిస్టులు తమ కొలమ్స్ లోనూ, ప్రెస్మీట్స్ లోనూ, సరైన సమధానాలను కోసం కనసర్నడ్ బోర్డ్ ను గాని, జట్టు యాజమాన్యన్ని గాని అడుగుతారు. తద్వారా సరైన పరిష్కారాలు లభిస్తాయి. ఇలా ఒకరి కి ఒకరు సంఘటితంగా, ఉదాసీనత లేకుండా సరైన సమధానాలకై వెతికితే, పోరాడితే...మనం ప్రేమించే ఈ క్రికెట్ క్రీడలో కూడా ప్రపంచకప్పులు సాధించగలం. 


ఇతర దేశాలలో ఇలాగే జరుగుతుంది. 


ఇప్పుడు మనవంతు వచ్చింది.!!

బహుపరాక్!! మేల్కోపోతే మరింత గా దిగజారడం ఖాయం!!!


అలా జరగదనీ, మనం సరైన దారి లో ఇక నించైనా ప్రయాణం చేస్తామని ఆశిస్తూ..


ఒక నిజమైన ఇండియా క్రికెట్ అభిమాని 


డా: చక్రవర్తి!

Comments

Popular posts from this blog

South Africa’s Long-Awaited ICC Victory: More Than Just a Trophy

Indian Women’s Cricket: A Dream Realized, A New Era Begins

భారత మహిళా క్రికెట్: కలల సాకారం, కొత్త యుగం ప్రారంభం