భారత మహిళా క్రికెట్: కలల సాకారం, కొత్త యుగం ప్రారంభం
భారత మహిళా క్రికెట్: కలల సాకారం, కొత్త యుగం ప్రారంభం డా బీ.ఎస్.చక్రవర్తి 03/11/2025 1983లో కపిల్ దేవ్ జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడు, భారత క్రికెట్‌కు ఒక కొత్త శకం మొదలైంది. ఆ విజయం క్రికెట్‌ను కేవలం ఆటగా కాకుండా మన జీవన విధానంగా మార్చేసింది. సచిన్, ద్రావిడ్, గంగూలీ, సెహ్వాగ్, ధోనీ, విరాట్, రోహిత్ శర్మ వంటి మహారథుల రాకతో క్రికెట్ పురాణగాథల్లో చోటు సంపాదించుకుంది. అది ఒక మహావృక్షంలా ఎదిగి, ఇతర క్రీడలన్నింటినీ మించిపోయింది. కానీ మహిళా క్రికెట్‌కు ఆ నిర్ణయాత్మక క్షణం రావడానికి ఇంకా కాలం పట్టింది. నిన్న ఆ క్షణం వచ్చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని మన అమ్మాయిలు ప్రపంచకప్ ట్రోఫీని ఎత్తుకుని చరిత్ర సృష్టించారు. గొప్ప టెన్నిస్ దిగ్గజం బిల్లీ జీన్ కింగ్ ఒకసారి అన్నారు, “ఛాంపియన్లు సరిగ్గా చేసేవరకు ఆడుతూనే ఉంటారు.” మన గతంలో వచ్చిన దిగ్గజాలు అలానే ఆడుతూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు, నమ్మకం కోల్పోలేదు. శాంతా రంగస్వామి, డయానా ఎడుల్జీ, ఝులన్ గోస్వామి, అంజుమ్ చోప్రా, మన తెలుగు అమ్మాయి మిథాలీ రాజ్ – ఈ అమ్మాయిలు దశాబ్దాల పాటు అలుపెరగకుండా శ్రమించారు. వారి త్యాగం, అంకితభావం, క్రీడపై ఉన్న అపా...